ప్రియమైన తెలుగు మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా 2022 సంవత్సరానికి ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ కు అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకొన్న కార్యవర్గానికి నా కృతజ్ఞతలు. గత 37 సంవత్సరాలుగా ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్ చికాగో ప్రాంతంలో ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ కార్యక్రమాలను మా నూతన కార్యవర్గం మరింత ఉత్సాహంతో 2022 సంవత్సరంలో జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. సంస్థ కార్యకలాపాలకు తమ సహాయ సహకారాలు అందిస్తున్న స్వచ్ఛంద సేవా కార్యకర్తలకు మా కార్యవర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరంలో మేము తలపెడుతున్న అనేక కార్యక్రమాలకు మీ సహాయ సహకారాలు అర్థిస్తూ

హేమచంద్ర వీరవల్లి,

ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు